పాతిన విద్యుత్ స్తంభాలకు వైర్ కనెక్షన్ ఇవ్వండి…
1 min read

హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలంలో రాళ్ల చేను కాలనీవాసుల 25 సంవత్సరాల నుంచి ఈ కాలనీలో నివాసం ఉంటున్నాము. కానీ మా కాలనీలో విద్యుత్ కనెక్షన్ కొరకు గత సంవత్సరం కితం విద్యుత్ స్తంభాలు పాతడం జరిగింది. కానీ ఇప్పటివరకు దానికి వైర్ కనెక్షన్ ఇవ్వలేదు. రాత్రి సమయంలో కొండ ప్రాంతం అయిన మా కాలనీలో విషపురుగులు (పాములు) ఎక్కువగా ఉన్నాయి కావున అలాగే గత 2 సంవత్సరాల 3 గుడిసెలు విద్యుత్ షాక్ వల్ల కాలిపోయాయి కావున మా మీద దయవుంచి పాతిన విద్యుత్ స్తంభాలకు వైర్ కనెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరారు.

