మున్సిపల్ ఉపాధ్యాయుడి సస్పెన్షన్
1 min readపల్లెవెలుగు, కర్నూలు;
కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న నగర పాలక ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఈ.రాముడు( ఎస్.జి.టి) అనే ఉపాధ్యాయుడిని బుధువారం కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ సస్పెండ్ చేశారు. ఈ మేరకే బుధవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్ డి.కె.బాలాజీ సదురు పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనాన్ని తిని పరిశీలించారు. అనంతరం స్టాక్ రిజిస్టర్లు, విద్యార్థుల హాజరు, విద్యాభ్యాసం, వారిలో చదువుపై ఉన్న ఆసక్తి, నైపుణ్యాలు, మెళకువలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో పనిచేస్తున్న ఈ.రాముడు అనే ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధించే లెస్సన్ ప్లాన్స్(lesson plans)తో పాటు టీచింగ్ డైరీని, చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఉపయోగపడే టీచింగ్ నోట్స్ అంశాలను సక్రమంగా రికార్డు చేయకపోవడం, వాటిని రిజిస్టర్లల్లో పొందుపరచపోవడంతో పాటు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించి ఉపాధ్యాయుడు ఈ.రాముడును సస్పెండ్ చేస్తున్నట్లు మునిసిపల్ కమిషనర్ డి.కె.బాలాజీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.