NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“మాజీ సైనికుల కొరకు ఉచిత న్యాయ సేవలు” 

1 min read

 కర్నూలు, న్యూస్​ నేడు:  రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి  సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, కార్యదర్శి  గారైన  బి. లీలా వెంకట శేషాద్రి  25-07-2026 శనివారం  నాడు బి.క్యాంపు నందు గల జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్  నందు జులై 26 కార్గిల్ విజయ్ దివస్ సందర్బంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. 1999 లో కార్గిల్ యుద్ధంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా ఈ కార్గిల్ విజయ్ దివస్ జులై 26 న జరుపుకుంటామని తెలిపారు. అనంతరం కార్గిల్ యుద్ధంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన 527 మంది వీర సైనికులను స్మరించుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ సైనికుల, వారి కుటుంబాల సమస్యల గురించి విచారించి కొన్ని సమస్య లను పరిష్కారించారు . జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం నందు  మాజీ సైనికుల కొరకు నల్సా వీర్ పరివార్ సహాయత యోజన 2025 పధకం లో భాగంగా లీగల్ సర్వీసెస్ క్లినిక్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు .  జడ్జి మాట్లడుతూ ఈ క్లినిక్ నందు న్యాయ వాది మరియు ప్యారా లీగల్ వాలంటీర్ లు ఉంటారని వీరు మాజీ సైనికుల కు చట్టభద్ధ మైన సమస్య లు ఉంటే వాటికీ ఉచితంగా న్యాయాన్ని అందించి వారి సమస్య లను పరిష్కరిస్తారని తెలిపారు.  మాజీ సైనికులు అందరు ఉచిత న్యాయ సహాయానికి అర్హులని తెలిపారు. మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులు వారి చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 15100 కు ఫోన్ చేస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. మాజీ సైనికులు అందరికీ జడ్జి  చేతుల మీదుగా వీర్ పరివార్ లీగల్ ఎయిడ్ కార్డ్స్ పంపిని చేశారు.ఈ కార్డ్స్ లో లీగల్ సర్వీసెస్ కు సంబంధించిన అడ్రస్సు ఫోన్ నెంబర్ మరియు హెల్ప్ లైన్ నెంబర్  మరియు ఉచిత న్యాయవాది మరియు పి ఎల్ వి ల ఫోన్ నెంబర్లు ఉంటాయని వీటి ద్వారా మాజీ సైనికులు తమ సమస్యలను లీగల్ సర్వీసెస్ వారికి తెలుపు కోవచ్చని తెలిపారు. ఈ సదస్సు లో  కర్నూలు జిల్లా ఇంచార్జి సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్  మహేంద్రమ్మ , లీగల్ ఎయిడ్ లాయర్ విజయ లక్ష్మి,ప్యారా లీగల్ వాలంటీర్ మధు సుధన్  రావు, మాజీ సైనిక ఉద్యోగుల అధ్యక్షులు, మాజీ సైనికులు పాల్గొన్నారు.

About Author