వైజ్ఞానిక యాత్రకు వెళ్లిన 250 మంది విద్యార్థులు
1 min read
భోజన సదుపాయం ఏర్పాటుచేసిన ఎమ్మెల్యే చింతమనేని
కృతజ్ఞతలు తెలియజేసిన ఏలూరు డిఎస్ఓ సోమయాజులు, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డి.మేరీ ఝాన్సీ రాణి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఈ నెల 17 వ తారీఖున వైజ్ఞానిక యాత్ర నిమిత్తం ఏలూరు నుండి హైదరాబాద్ వెళ్లిన 250 మంది వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు దెందులూరు నియోజకవర్గ ఎం.ఎల్.ఎ. చింతమనేని ప్రభాకర్ హైదరాబాద్ లోని పారడైస్ హోటల్లో మధ్యాహ్న భోజనం ఆతిధ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎం.ఎల్.ఎ చూపిన ఆధరాభిమానాలకు కృతజ్ఞతతో ఏలూరు డి.ఎస్.ఓ సోమయాజులు, వట్లూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ దాసరి మేరీ ఝాన్సీ రాణి,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఈ రోజు ప్రభాకర్ ని కలిసి పుష్పగుచ్చం అందించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.