ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 395 జయంతోత్సవాలు
1 min read
పల్లెవెలుగు, పత్తికొండ: మరాఠా సామ్రాట్ యోధుడు చత్రపతి శివాజీ 395 వ జయంతి ఉత్సవాలను బుధవారం బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా నాయకులు శ్రీనివాస్, బిజెపి అసెంబ్లీ కో కన్వీనర్ గోవర్ధన్ నాయుడు మాట్లాడుతూ, భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య రాజులను ఎదిరించి పోరాడిన ధీరుడు మహావీరుడు చత్రపతి శివాజీ అని కొనియాడారు. అలాగే దేశవ్యాప్తంగా హైందవులను ఏకతాటిపైకి తెచ్చి హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి మూల పురుషుడు పోరాట పటిమగల ధీరుడు శివాజీ అని అన్నారు. ఆయన జయంతిని మనమందరం ఘనంగా నిర్వహించుకుని ఆయన చూపిన పోరాటపటిమను ఆయన శక్తిని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పత్తికొండ బిజెపి పార్టీ శాఖ తరపున చత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిజెపి మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. బిజెపి నూతన కమిటీ మండల అధ్యక్షులుగా కరణం నరేష్ ను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ దండి మల్లికార్జున, జిల్లా కార్యదర్శి హోసూరు బ్రహ్మయ్య, నాయకులు పూనా మల్లికార్జున, కరణం నరేష్, మల్లేకర్ వీరేష్, రామాంజనేయులు, శంకరయ్య ఆచారి, సిసి రంగన్న,నాగేష్, భాస్కర్, మనోహర్ చౌదరి, గోపాల్, లక్ష్మణ స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.