ఎద్దుల యజమానికి 40 వేల ఆర్థిక సహాయం
1 min read
ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మా ఉద్దేశ్యం..
మిడుతూరు, న్యూస్ నేడు: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే తమ ముఖ్య ఉద్దేశమని పీరు సాహెబ్ పేట టిడిపి నాయకులు అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేటలో సోమవారం గ్రామ సమీపంలో ఉన్న గ్రానైట్ గుంతల్లో గ్రామానికి చెందిన రైతు జరపటి రంగస్వామికి చెందిన ఎద్దులు పొలంలో పని ముగించుకొని ఇంటికి వస్తూ ఉండగా ఎద్దుల బండితో ఉన్న ఎద్దులను గుంతలో నీళ్లు తాపడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు గుంతలోఎద్దుల బండి పడడంతో ఎద్దులు అక్కడికక్కడే మరణించాయి.ఒక లక్ష 20వేలు విలువ చేసే ఎద్దులు మరణించడంతో రంగస్వామి కుటుంబం దిగాలుతో ఉండటంతో గమనించిన స్థానిక టిడిపి నేతలు మంచి మనసుతో స్పందించి 40 వేల రూపాయలను మంగళవారం మధ్యాహ్నం వారి ఇంటికి వెళ్లి మిడుతూరు ఎస్సై ఓబులేష్ తో ఆర్థిక సహాయాన్ని అందించారు.కుటుంబానికి వారు ధైర్యం చెప్పారు.టిడిపి నేతమాండ్ర శివానందరెడ్డి మరియు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదేశాల మేరకు ఈ నగదును అందజేసినట్లు గ్రామ టిడిపి దేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి,నాయకులు సోమ సుందర్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి జయరాముడు,పుల్లారెడ్డి, మీనిగ మహేష్ రెడ్డి,మర్రి కుంట మహేష్ రెడ్డి,ఇడమకంటి మురళీధర్ రెడ్డి,నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

