వాల్మీకుల ఎస్టీ బిల్లు కోసం 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/91-3.jpg?fit=550%2C249&ssl=1)
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ సాధిస్తాం
ఐక్యంగా పోరాడి సాధించుకుందాం
త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం
రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బి లక్ష్మన్న
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : వాల్మీకుల ఎస్టీ బిల్లు కోసం సంఘాన్ని ఏర్పాటు చేసి 40 ఏళ్ల పోరాటం చేయడం జరిగిందని ఎస్టీ బిల్లు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ సాధిస్తామని రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ అధ్యక్షులు బి లక్ష్మన్న పేర్కొన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో వాల్మీకి బోయల ముఖ్య నాయకులు సమావేశం లక్ష్మన్న అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గాపురం చిన్న ఈరన్న, రాష్ట్ర నాయకులు లంకా రెడ్డి, నది చాగి మారెన్న , సర్పంచ్ తిమ్మప్ప , సర్పంచ్ శివరాములు ,మాజీ సర్పంచ్ లు జె హనుమంతు, జయన్న, శేషాద్రి తిమ్మప్ప , మునెప్ప , ఈ రెడ్డి , మహదేవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బి లక్ష్మణ మాట్లాడుతూ వాల్మీకుల ఎస్టీ బిల్లు ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు అన్నారు. 40 ఏళ్ల క్రితం సంఘాన్ని ఏర్పాటు చేసి సుదీర్ఘమైన పోరాటం చేశామని గుర్తు చేశారు. 40 ఏళ్ల క్రితం నాతోపాటు సంఘాన్ని స్థాపించి పోరాటం చేసిన వారిలో అందరూ స్వర్గస్తులైనారని అన్నారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేశామని ప్రతి జిల్లాలలో నియోజకవర్గాలలో వాల్మీకి బోయల సభలు సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. కొన్ని నియోజకవర్గాలలో వాల్మీకి బోయల సింహ గర్జనలు ఏర్పాటు చేశామని అప్పట్లో వాల్మీకులు వేల సంఖ్యలో తరలి వచ్చి సభలను విజయవంతం చేశారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది నాయకులు వాల్మీకి బోయల ఎస్టీ బిల్లు కొరకు ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు. . కీర్తిశేషులు ఎన్టీ రామారావు కంటే ముందు కీర్తిశేషులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాల్మీకి బోయల సంఘాన్ని స్థాపించి అప్పటినుంచి ఇప్పటివరకు గద్దెనెక్కిన ప్రతి ముఖ్యమంత్రి ని కలిశామని తెలిపారు. ప్రతి ముఖ్యమంత్రి వాల్మీకి బోయల స్థితిగతులను వివరించి వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించుటకు తగిన ఆవశ్యకతలను కూడా వివరించాలని తెలిపారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఏ పార్టీ అధికారంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న ఆ పార్టీకి గానీ ఆ ముఖ్యమంత్రి కి గాని వాల్మీకి బోయల స్థితిగతులను వివరించి వాల్మీకి బోయల జాతి కొరకు పోరాటం చేశామని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ లకు వాల్మీకి బోయల స్థితిగతుల గురించి తెలుసు నని వీరిద్దరూ కలిసి మన ప్రధానమంత్రి మోడీ కి ఒక్క మాట చెబితే చాలని పార్లమెంట్లో, రాజ్యసభలో, వాల్మీకుల ఎస్టీ బిల్లు తప్పకుండా పాస్ చేయిస్తారని వాల్మీకి బోయలకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ఇటీవల నేను రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తోను, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కే నాగబాబు ని కలిసి వాల్మీకి బోయల స్థితిగతులను వివరించి మెమోరాండం ఇవ్వడం జరిగిందని తెలిపారు. దీనికి మంత్రి తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగబాబు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ తో చర్చిద్దామని మాట ఇవ్వడం జరిగిందని తెలిపారు. మరియు ఇప్పటినుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాల్మీకులను బోయలను చైతన్య పరిచి గ్రామ కమిటీలు మండల కమిటీలు తాలూకా కమిటీలు జిల్లా కమిటీలు వేసి ప్రతి వాల్మీకులకు బాధ్యత అప్పగించి పెద్ద ఎత్తున వాల్మీకి / బోయల మహాసభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కొంతమంది వాల్మీకి బోయల యువ నాయకులు సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని అన్ని సంఘాలను కలుపుకొని జేఏసీగా ఏర్పాటు చేసి ఐకమత్యంతో పోరాటం చేస్తే పోరాటం బలంగా ఉంటుందని తెలిపారు. తొందర్లో వారిని కలిసి అన్ని సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. భారతదేశాన్ని బ్రిటిష్ వారి పాలన నుంచి దేశానికి స్వాతంత్రం తెచ్చుటకు ఎంతోమంది వీరులు రకరకాలుగా పోరాటం చేశారని అందరి పోరాట ఫలితంగానే దేశానికి స్వాతంత్రం రావడం జరిగిందని తెలిపారు. అందువల్ల మన యువ నాయకులకు కూడా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గాపురం చిన్న ఈరన్న మాట్లాడుతూ ఈసారి వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించుటకు రాష్ట్ర ప్రభుత్వం మీద,కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని ఈసారి తప్పకుండా ఎన్డీఏ కూటమిలోనే వాల్మీకులను/ బోయలను ఎస్టీలుగా గుర్తించే విధంగా తీవ్రంగా కృషి చేస్తామని తెలిపారు. వాల్మీకి/ బోయల ముఖ్య నాయకుల సభకు వచ్చిన చాలామంది నాయకులు మాట్లాడారు. వారందరూ కూడా ఒకే మాటపై నిలబడి రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ ద్వారా ఈసారి వాల్మీకుల ఎస్టీ బిల్లు పాస్ చేసే విధంగా కృషి చేద్దామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సభకు వాల్మీకి ముఖ్య నాయకులు వెంకటేశులు, మణికంఠ, గోపాలు, బోడి స్వామి, శ్రీరాములు, నర్సింలు, ఉరుకుందు, హనుమేష్, వన్నూరి, శీను, శేఖర్,గోవిందు, చిన్న మా దేవా మరియు ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/9-8.jpg?resize=550%2C248&ssl=1)