NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“44వ ఇఎన్టీ రాష్ట్ర స్థాయి సదస్సు

1 min read

కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు :  కర్నూలు మెడికల్ కాలేజీలో 11,12,13 తేదీల్లో  నిర్వహించనున్న ఇఎన్టీ (ENT) రాష్ట్రస్థాయి సదస్సు మరియు వర్క్‌షాప్‌లకు సంబంధించి కార్యక్రమ నిర్వాహకులు గురువారం కర్నూలు మెడికల్ కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపల్ డా.హరి చరణ్ ను కలిసి బ్రోచర్ ను అందచేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమాము లో ఇఎన్టీ ఈ భాగపు అధిపతి డాక్టర్ హరికృష్ణ ఏవోఐ కర్నూల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహేంద్ర కుమార్ లు ప్రిన్సిపాల్ ను కలిసి మూడు రోజుల కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ రాష్ట్ర శాసనసభకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ,ప్రిన్సిపల్, సూపరిండెంట్ అతిథులుగా హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ రాష్ట్రస్థాయి సదస్సుకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈఎన్టీ వైద్య నిపుణులు, వైద్యులు పాల్గొననున్నారు. ఇందులో భాగంగా  ఈఎన్టీ వైద్యరంగంలో మానవ  నమూనాలపై వివిధ ఈఎన్టీ ప్రొసీజర్ , పరీక్షలు, ఆధునిక చికిత్సా విధానాలు, శస్త్రచికిత్సా పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించే విధంగా వర్క్‌షాప్‌లు  నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమం ద్వారా ఇఎన్టీ వైద్యరంగంలో తాజా అధునాతన పరిజ్ఞానాన్ని వైద్యులకు అందించడంతో పాటు, వైద్య నిపుణుల మధ్య అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.కర్నూలు మెడికల్ కాలేజీ లో నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర సదస్సుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ హరి చరణ్ నిర్వాహకులకు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *