దేవరగట్టులో అమావాస్య పూజలు
1 min read
భక్తులతో కిటకిటలాడిన శ్రీ మాళమల్లేశ్వర స్వామి ఆలయం
దేవరగట్టులో అమావాస్య పూజలు – భక్తులతో కిటకిటలాడిన ఆలయం
హోళగుంద న్యూస్ నేడు: అమావాస్య సందర్భంగా దేవరగట్టు శ్రీ మాళమల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీ మాళమల్లేశ్వర స్వామివారికి అభిషేకం, బిల్వార్చన, బండారు అర్చనతో పాటు అమ్మవారికి కుంకుమార్చన, ఆకు పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ మెట్ల వద్ద ప్రతి మెట్టుకు కర్పూరం వెలిగిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు గిరిస్వామి, మనోహర్ స్వాములు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు చిన్నరాళ్లకు కుంకుమ, బండారు అర్పిస్తూ తమ మొక్కులు తీర్చుకున్నారు. అమావాస్య సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తుల కోసం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నదానంలో పాల్గొన్నారు.



