9 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ సి ఏ టీ సి–1 శిబిరం ఉత్సాహంగా ప్రారంభం
1 min read
– రెండో రోజు ట్రెక్కింగ్, మ్యాప్ రీడింగ్ శిక్షణ
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు గ్రూప్ పరిధిలోని Ridge School ప్రాంగణంలో నిర్వహిస్తున్న 9 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ సి ఏ టీ సి–1 (Combined Annual Training Camp) శిబిరం నిన్న ఘనంగా ప్రారంభమై, రెండవ రోజు శిక్షణ కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగాయి.శిబిర ప్రారంభ కార్యక్రమంలో క్యాంప్ కమాండెంట్, 9 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌గా పాల్గొని కేడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన సమూహ జీవనం యొక్క ప్రాముఖ్యతను వివరించి, శిబిరంలో పాటించాల్సిన నియమాలు, శిక్షణా కార్యక్రమాలు, దినచర్య (టైమ్ షెడ్యూల్) తదితర అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు. కేడెట్లతో ఉత్సాహభరితంగా మమేకమై శిబిరానికి శుభారంభం కల్పించారు.అలాగే కర్నూలు గ్రూప్ కమాండర్ కల్నల్ అలోక్ త్రిపాఠి గారు అతిథిగా విచ్చేసి శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేడెట్లు గార్డ్ ఆఫ్ ఆనర్ అందించారు. అనంతరం ఆయన ఏఎన్ఓలతో సమావేశమై శిబిర నిర్వహణపై చర్చించి, కేడెట్లకు సమయ నిర్వహణ, పరస్పర సహకారం, సమూహ జీవనం వంటి అంశాల ప్రాధాన్యతను వివరించారు.రెండవ రోజు శిక్షణలో భాగంగా 14 మంది కేడెట్లు సమీపంలోని Jagannathagattu పర్యాటక ప్రదేశానికి వెళ్లి ట్రెక్కింగ్ మరియు మ్యాప్ రీడింగ్ శిక్షణ పొందారు. ఇది టీ ఎస్ సి (Thal Sainik Camp) ఎంపికల కోసం నిర్వహించిన ప్రత్యేక శిక్షణగా చేపట్టబడింది.కేడెట్లు Ridge School ప్రాంగణం నుంచి Jagannathagattu వరకు సుమారు 3–4 కిలోమీటర్ల ట్రెక్కింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కమాండెంట్ కల్నల్ జోబీ ఫిలిప్ , రిడ్జ్ స్కూల్ ఏఎన్ఓ సెకండ్ ఆఫీసర్ పి. హేమదుర్గా , జి సి ఐ శివగంగా పాల్గొన్నారు.శిక్షణ అనంతరం కల్నల్ జోబీ ఫిలిప్ మాట్లాడుతూ, జీవితంలో సాహసాలు వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. మ్యాప్ రీడింగ్ ద్వారా మార్గం తప్పినప్పుడు తిరిగి దారి కనుగొనడం ఎలా అనే విషయాన్ని ప్రాక్టికల్‌గా వివరించి కేడెట్లకు శిక్షణ అందించారు.ఈ విధంగా శిబిరం ప్రారంభ దశ నుంచే క్రమశిక్షణతో, ఉత్సాహంతో కొనసాగుతూ, కేడెట్లలో ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు సమయస్ఫూర్తిని పెంపొందిస్తోంది.

