ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/18-3.jpg?fit=550%2C248&ssl=1)
సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్.
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ),ఏలూరు 27వ డివిజన్ నందు ఏరియా కార్యవర్గ సభ్యులు మావూరి విజయ,బి కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇంటి స్థలాలను పెంచి ఇవ్వాలని అర్జీల నమోదు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు సొంత ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాల్లో ఇచ్చిన సెంటు భూమిని రెండు సెంట్లుగా,గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లుగా పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారుల నుండి అర్జీల నమోదు కార్యక్రమం జనవరి 27 నుండి ఫిబ్రవరి 9వ తారీకు వరకు నిర్వహించి ఫిబ్రవరి 10వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద లబ్ధిదారులతో కలిసి జిల్లా కలెక్టర్ కు అర్జీలు అందించాలని పిలుపునిచ్చిందని తెలిపారు. ఆ పిలుపులో భాగంగా గత పది రోజులుగా ఏలూరు నగరంలోని వివిధ డివిజన్ల లో అర్జీలు నమోదు కార్యక్రమం ఏరియా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో పాల్గొని అర్జీలు నమోదు చేయించుకున్న లబ్ధిదారులందరూ ఈనెల 10వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి కలెక్టర్కి తమ అర్జీలను అందించాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యవర్గ సభ్యురాలు కొండేటి బేబి మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ళు పేరిట ఆర్భాటంగా ఊర్లు నిర్మిస్తున్నామని చెబుతూ పేదలకు కేవలం సెంటు భూమి మాత్రమేఇవ్వడం దారుణమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాన్ని పెంచి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10వ తేదీన జరిగే కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే అర్జీలు అందించే కార్యక్రమంలో లబ్ధిదారులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా సమితి నాయకులు గొర్లి స్వాతి,బి.శ్రీదేవి,ఆది నారాయణ, రమణయ్య,తదితరులు పాల్గొన్నారు.