NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

85లక్షలు పని దీనికిగాను 22వేలు జరిమానా

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు: 2024-2025మార్చీ వరకు సామాజిక తనిఖీ ని ప్యాపిలి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ వెంకటేశ్వర్లు అధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు.మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నికి తనిఖీ కి పిడి సూర్య నారాయణ,డివిఓ అన్వర్ బేగం,ఎపిడి నరసింహ రెడ్డి, ఎస్ టిఎం కొనయ్య, ఎస్ ఆర్పి చంద్రమోహన్ తనిఖీలు నిర్వహించారు, ప్యాపిలి మండలంలోని 31 పంచాయతీ ఉపాధి హామీ పథకం గాను 2024-2025 సంవత్సరం గాను 85లక్షలు పనులు చేయగా 22వేలు జరిమానా విధించి,18లక్షల ఉపాధి హామీ నిర్వహిస్తూ,9లక్షలు మొక్కలు నాటేందుకు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ఎన్ ఆర్ జి ఎస్ పనులు ప్రతి ఒక్కరు 310 రూపాయలు వేతనం పడేలా పనులు చేయాలని అందుకుగాను 265 రూపాయలు పని వేతనాలు చేపడుతున్నారని అన్నారు. అలాగే ఏపీఓలు ప్రతి బుధవారం ఎన్ఆర్జిఎస్ మేటి లకు ఫీల్డ్ అసిస్టెంట్లకు సమావేశం నిర్వహించి వారికి ఉపాధి హామీ పథకాలపై అవగాహన కలిగించాలి ఏదో పనులు చేపిస్తున్నాము పెడుతున్నాము అంటే సరిపోదని, ప్యాపిలి మండలం హార్టికల్చర్ పై ఎక్కువ ఆధారపడి ఉంది కనుక ప్రతి ఒక్కరు రైతుకు హార్టికల్చర్ పై చూపి ఉపాధి హామీ పథకాలపై రాయి తిని పొందాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ ఏ ఈ ప్రభాకర్ రెడ్డి, హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు, ఎన్ ఆర్ జి ఎస్ ఏపీవోలు వెంకటరమణ, రవి, శ్రీవిద్య మరియు గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

About Author