ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
1 min read
వినతులు స్వీకరించి అధికారులకు ఆదేశాలు
అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..ఏలూరు ఎమ్మెల్యే చంటి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అన్నివర్గాల ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజలకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే బడేటి చంటి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి వినతులను స్వీకరించారు. సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని బాధితులకు భరోసా కల్పించారు.అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు.బడేటి చంటి ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

