లోక్ అదాలత్ లో 916 కేసుల పరిష్కారం
1 min read
సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి..
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు కోర్టులో 916 కేసులను పరిష్కరించినట్లు సీనియర్ సివిల్ జడ్జి ఏ శోభారాణి తెలిపారు.శనివారం నందికొట్కూరు కోర్ట్ లో జరిగిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతం అయింది.జాతీయ లోక్ అదాలత్ రెండు బెంచులల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా సీనియర్ మరియు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు యొక్క కేసులు మొత్తం 916 కేసులను పరిష్కరించామని సీనియర్ సివిల్ జడ్జ్ మరియు లోక్ అదాలత్ చైర్మన్ ఏ. శోభారాణి మరియు జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి వి.దివ్య అన్నారు.
పరిష్కరించిన కేసుల వివరాలు
ఇందులో ప్లీ బార్గింగ్ కేసులు- 811,క్రిమినల్ కేసులు-28, ఎన్ఐ యాక్ట్ కేసులు-7, ఎక్సైజ్ కేసులు-33,సివిల్ మరియు ఆస్తి తగాదాలు- 11,బ్యాంకు కేసు-14,వెరసి మొత్తం-916 కేసులను పరిష్కరించినట్లు జడ్జీలు తెలిపారు.ఈ జాతీయ లోక్ అదాలత్ కు సహకరించిన బార్ అసోసియేషన్ న్యాయవాదులకు లోక్ అదాలత్ బెంచ్ నామినేటెడ్ సభ్యులకు,పోలీస్ లకు తదితర అధికారులకు మరియు కక్షిదారులకు జడ్జిలు కృతజ్ఞతలు తెలిపారు.

