NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తలముడిపిలో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ట

1 min read

పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జయసూర్య..

మిడుతూరు(నందికొట్కూరు)న్యూస్ నేడు: నంద్యాల జిల్లామిడుతూరు మండల పరిధిలోని తలముడిపి మరియు వీపనగండ్ల గ్రామాల్లో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య,మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి దేవాలయాల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.గురువారం ఉదయం తలముడిపి గ్రామంలో శ్రీ ఉమా సహిత జటేశ్వర స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట అశేష భక్తుల నడుమఘనంగా జరిగింది.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రజలు ప్రత్యేకంగా పూజల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ముందుగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.దేవాలయంలో ప్రత్యేక హోమం, జటేశ్వరస్వామి వారికి  అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు.తర్వాత వీపనగండ్లలో జరిగిన శ్రీ నాభిశిలా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.గ్రామానికి చెందిన షేక్ కైరున్ భీకి 21,541 రూ.ల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, వంగాల శివరామిరెడ్డి, రమణారెడ్డి,రవికాంత్ రెడ్డి, బాలనాగిరెడ్డి,మనోహర్ రెడ్డి మరియు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఎస్ఐలు పాల్గొన్నారు.

About Author