NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిడుతూరు’లో చలివేంద్రం ఎక్కడ.?

1 min read

చలివేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్న మండల ప్రజలు..

మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో చలివేంద్రం ఎక్కడ అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.42 డిగ్రీలతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మండలంలో 19 పంచాయితీలు నాలుగు మజార గ్రామాలతో కలిపితే 24 గ్రామాలు ఉన్నాయి. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు దాహానికి గురౌతున్నారు.మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం,మండల పరిషత్తు,వ్యవసాయ శాఖ, ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలు, బాలబాలికల వసతి గృహాలు ఉన్నాయి.అనునిత్యం పనుల నిమిత్తం వివిధ గ్రామాల ప్రజలు మండల కార్యాలయాలకు రావడం సహజం.విద్యార్థులు అయితే పాఠశాలలకు కళాశాలలకు వచ్చి వెళ్తూ ఉండేవారు. నీటిని దాహం తీర్చుకునేందుకు స్థానికంగా ఒక్క టీ హోటల్ ఉండడంతో ఈ హోటల్ దగ్గరికి ప్రజలు విద్యార్థులు వెళ్తున్నారు. మండల ప్రజలను దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.మరి చలివేంద్రం ఏర్పాటు చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *