అంబులెన్స్ కు సెకండ్లలో దారిని క్లియర్ చేసిన సీఐ..
1 min read

మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని తలముడిపి గ్రామంలో జరిగిన శ్రీ ఉమా సహిత జటేశ్వర స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి వచ్చిన నంద్యాల పార్లమెంట్ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి గ్రామానికి గురువారం ఉదయం చేరుకున్నారు. స్థానిక బస్టాండ్ వద్దగ్రామ నాయకుల ఆధ్వర్యంలో ఎంపీ కారు దిగిన వెంటనే ఎంపీపీ నాయకులు మహిళలు ఎంపీకి పూల బోకేలతో స్వాగతం పలుకుతుండగా ధ్వజస్తంభ ప్రతిష్ట సందర్భంగా బంధువులతో బస్టాండ్ ప్రాంతమంతా కిక్కురిసిపోయింది.అప్పుడే గడివేముల నుండి మిడుతూరుకు అంబులెన్స్(ఏపీ 39 టిఎల్ 8846)వస్తుండగా వెంటనే గమనించిన నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐలు సిబ్బందితో కలిసి అంబులెన్స్ కు దారి వదలాలని సెకండ్లలోనే రోడ్డుపై ఉన్న ప్రజలను పక్కకు పంపడంతో అంబులెన్స్ వెళ్లేందుకు రోడ్డును క్లియర్ చేయడంతో అంబులెన్స్ ను పంపించడంతో అక్కడున్న ప్రజలు పోలీసులకు హ్యాట్సాఫ్ చెప్పారు.

