అప్పన్నవీడు శ్రీ అభయాంజనేయ స్వామి వారి 25వ హనుమాన్ జయంతి ఉత్సవలు
1 min read

గోడ పత్రికను ఆవిష్కరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఎమ్మెల్యే కి వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ అర్చకులు,ఆలయ కమిటీ బృందం
మే 7 నుంచి 12 వరకు జరగనున్న హనుమాన్ జయంతి వేడుకలు
ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని,భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి
ఆలయ కమిటీకి తగు సూచనలు జారీ చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం ప్రజల నుంచి వినతుల స్వీకరణ
సత్వర పరిష్కార దిశగా అధికారులకు ఆదేశం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ని ఈరోజు దుగ్గిరాలలోని వారి క్యాంపు కార్యాలయంలో అప్పన్నవీడు లోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ అర్చకులు మరియు పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అర్చకులు ఎమ్మెల్యే కి వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనాలు అందించి,స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.అప్పన్నవీడు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మే 7వ తేదీ నుండి మే 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న 25వ హనుమాన్ జయంతి ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను (Posters) మరియు కరపత్రాలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల కోర్కెలు తీర్చే అభయాంజనేయ స్వామి వారి రజతోత్సవ వేడుకలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలందరిపై స్వామి వారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకున్నారు.అనంతరం నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజల నుండి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన,వాటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో పలువురు కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. పలు సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే కి అందజేసి ఆయనను ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ వేమూరి శ్రీనివాస్ సహా కమిటీ సభ్యులు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

