NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాయితీలను పన్నుదారులు సద్వినియోగం చేసుకోవాలి

1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు

కర్నూలు, న్యూస్​ నేడు:  శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుల చెల్లింపులపై కల్పిస్తున్న రాయితీలను పన్నుదారులు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు కోరారు. నగరపాలక కార్యాలయంలో పన్ను వసూళ్ల కేంద్రాన్ని పరిశీలించారు. అదేవిధంగా దూపాడు, లక్ష్మీపురంకు చెందిన విశ్వం ఎడ్యుకేషన్ సొసైటీ, అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి రూ.12,90,163 ముందస్తు ఆస్తి పన్ను చెక్‌ను స్వీకరించగా, వారికి రూ.67,573 రాయితీ లభించింది.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆస్తి పన్ను బకాయిలను ఏకమొత్తంలో చెల్లించిన వారికి 50 శాతం వడ్డీ రాయితీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నును ముందస్తుగా ఏకమొత్తంలో చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. ఏప్రిల్ 30 లోపు ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని పన్నులు సమయానికి చెల్లించాలని సూచించారు. కార్యక్రమంలో మేనేజర్ ఎన్. చిన్న రాముడు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *