విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో నూరుశాతం చేరికలు ఉండాలి
1 min read

అంగన్వాడి ఫ్రీస్కూలులో ఐదు ఏళ్లు నుండిన 6 మంది పిల్లలను తన కారులో ఎక్కించుకుని ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతిలో స్వయంగా జాయిన్ చేసి,గ్రామ ప్రజలకు, చిన్నారులకు జోష్ నింపిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లాప్రతినిధి , న్యూస్ నేడు: ఏలూరు మండలం పోణంగి గ్రామంలో శుక్రవారం అంగన్వాడి ప్రీస్కూలులో అయిదు సంవత్సరాలు నుండి ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతిలో జాయిను చేసే కార్యక్రమంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పాల్గొన్నారు. అంగన్వాడీ ఫ్రీస్కూలులో విద్యా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి అంగన్వాడి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందించి ప్రాథమిక పాఠశాలలో 1వతరగతిలో చేరికలు వేగవంతం చెయ్యాలని అన్నారు. ఇదే ఫ్రీస్కూలులో 6 మందిని తన కారులో ఎక్కించుకుని ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతిలో స్వయంగా జాయిన్ చేసి పిల్లలకు చదువుపట్ల స్ఫూర్తిని నింపామని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడి ఫ్రీస్కూలులో విద్యా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న 7,480 మందిలో ఇప్పటివరకు 4572 మందిని ప్రాధమిక పాఠశాలలో 1వ తరగతిలో జాయిన్ చేశామని,మిగతా 2908 కొద్దిరోజుల్లో జాయిన్ చెయ్యడానికి అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. పోణంగి అంగన్వాడీ ఫీస్కూలులో మొత్తం 27 మంది పిల్లలు ఉన్నారని, ఐదు ఏళ్లు నిండి విజయవంతంగా విద్యా కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్న 11 మందిలో ఇప్పటికే 5 మంది పిల్లలు ప్రాథమిక పాఠశాలలో జాయిన్ అయ్యారని, మిగిలిన 6 మందిని స్వయంగా కారులో ఎక్కించుకుని ప్రాథమిక పాఠశాలలో 1వతరగతిలో జాయిన్ చేసి, టెస్టు, నోటు పుస్తకాలను అందించామని అన్నారు. ఇది పిల్లలు విద్యాప్రగతికి మరియు ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరగడానికి ఉపయోగ పడుతుందని అన్నారు.అంగన్వాడి ప్రీ-స్కూలులో అందిస్తున్న సేవలు, పిల్లల హాజరు, పోషణ వంటి అంశాలను కూడా పరిశీలించామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో లభించే ప్రయోజనాలుపై అవగాహన కల్పించి, వారిని ప్రభుత్వ పాఠశాలలు వైపు ఆకర్షించేలా చూడాలని అన్నారు. మెరుగైన మౌళిక సదుపాయాలు, సుశిక్షితులు అయిన టీచర్లు, ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు నోటు పుస్తకాలు,ఉచిత యూనిఫారాలు, డిజిటల్ క్లాసు రూమ్లు,నాణ్యమైన బోధన మరియు ఇంగ్లీష్ మీడియం, మధ్యాహ్న భోజనపథకం తదితర పథకాలను విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించి లక్ష్యాలను అధిగమించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఐసిడియస్ పిడి పి.శారద, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమ్మ, జిల్లా సర్వశిక్ష ఏపిసి డా.కె. పంకజ్ కుమార్, తహశీల్దారు కె.గాయత్రీ దేవి, మండల విద్యాశాఖ అధికారి వి.అరుణ్ కుమార్, సిడీపీవో ఏ.పద్మావతి, ప్రాధమిక పాఠశాల యస్జిటి బి.శాంతిశ్రీ, అంగన్వాడీ, ప్రాధమిక పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


