NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండలో ఘనంగా ” శ్రీ భగీరథ మహర్షి జయంతి” వేడుకలు

1 min read

న్యూస్ నేడు,పత్తికొండ: శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలను పత్తికొండలో సగరులు/ఉప్పరులు ఘనంగా నిర్వహించారు. గురువారం పత్తికొండ పట్టణంలోని ఉప్పరకట్ట దగ్గర శ్రీ భగీరథ మహర్షి చిత్రపటానికి సగర/ ఉప్పర సంఘం నాయకులు, కులస్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ పురవీధుల గుండా పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా పత్తికొండ తాలూకా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎస్. యు.వెంకటేశ్వర్లు, ఉప్పర బాలప్ప మాట్లాడుతూ…. భూమి నుండి దివికి గంగను తీసుకువచ్చిన మహర్షి శ్రీ భగీరథ మహర్షి అని, అలాంటి గొప్ప మహర్షి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో సగరులు/ ఉప్పరులు ఏకమై విద్య, వైద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ స్పందించి సగర కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సగర/ ఉప్పర సంఘం గౌరవ అధ్యక్షులు టీచర్ నరసింహమూర్తి, ట్రెజరర్ నరసింహమూర్తి, సభ్యులు పెద్ద సంకన్న, రవి, వరలక్ష్మీ, నాగరాజు, నర్సింహులు, హరీష్, నాగేష్, ప్రసాద్, వెంకటేశ్వర్లు, వీరాంజి, పెద్దయ్య, తిమ్మప్ప, నాగేష్, నాగరాజు, మళ్లీ, మద్దిలేటి, బాలరాజు, నారాయణ, నాగేంద్ర, కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *