NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

​ సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన పొలాలను పరిశీలించిన కలెక్టర్  

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కల్లూరు మండలములోని తడకనపల్లె గ్రామములో పిఎండీఎస్​  సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన పొలాలను గౌరవ జిల్లా కలెక్టర్  పరిశీలించారు. పిఎండీఎస్​   పొలాలలో చేసే విధానము గురించి దాని వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. ఆఫ్ మూన్ మోడల్ పరిశీలించారు. రైతులతో సమావేశము ఏర్పాటు చేసి ధర్తీ మాతా బచావో , నేల భూ సారాన్ని కాపాడాలని, రైతులు ఏక పంట కాకుండా పలు రకాల పంటలు , అంతర మరియు మిశ్రమ పంటలు సాగు చేయాలని, మార్కెట్ ఆధారిత పంటలను, పండ్లు మరియు పూల తోటలను సాగు చేయాలని అలాగే APMIP నుంచి స్ప్రింక్లర్ 50%, డ్రిప్ 90% సబ్సిడీ ఉన్నదని రైతులు అందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి పి ఎల్ వరలక్ష్మి , సహాయ వ్యవసాయ సంచాలకులు (రే) సాలు రెడ్డి , తహశీల్దార్ ఆంజనేయులు , డిపిఎం DPM శ్రీమతి మాధురి గ,మండల వ్యవసాయ అధికారి విష్ణు వర్ధన్ రెడ్డి కల్లూరు,హార్టికల్చర్ ఆఫీసర్ నరేష్ రెడ్డి , ZBNF స్టాఫ్ మరియు రైతులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *