NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రవి స్వీట్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

1 min read

ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య,మీనా దంపతులు

పలువురికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం

ఏలూరు, న్యూస్​ నేడు: ఏలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో స్థానిక ఆర్ఆర్ పేట రవి స్వీట్స్ వారి ఆధ్వర్యంలో శనివారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ చలివేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) సతీమణి మీనా బడేటి పాల్గొని బాదంపాలు, మజ్జిగ,మంచినీరు పంపిణీ చేశారు. రాబోయే వేసవి దృశ్య నగరంలోని ప్రముఖ వర్తక వ్యాపారవేత్తలు,సేవా సంస్థ ప్రతినిధులు ప్రజలకు దాహం తీర్చే చలివేంద్రాలు ఏర్పాటు చేసి పలువురికి ఉపయోగపడే సేవ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈరోజు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన రవి స్వీట్స్ నిర్వాహకులకు వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బడేటి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్ర హాస్పిటల్ డాక్టర్:యం ఏల్ వి ప్రసాద్,డివిజన్ ఇంచార్జ్ పిలారిశెట్టి సంధ్యా సురేష్ మరియు జైన్ జ్యువెలర్స్ అధినేత విజయ్ కుమార్ జైన్, స్థానికులు, పాదచారులు,ద్విచక్ర వాహనదారులు విచ్చేసి వేసవి చలివేంద్రంలో దాహార్తిని తీర్చుకున్నారు.

About Author