పెదపాడు శాఖ గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాలు
1 min read
ఏప్రిల్ 28 నుండి మే 6వ తేదీ వరకు శిబిరాలు నిర్వహణ
ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు కార్యక్రమాలు
గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు శాఖా గ్రంథాలయం నందు ఈనెల 28వ తేదీ నుండి జూన్ నెల 6వ తేదీ వరకు ఉచిత వేసవి విజ్ఞాన శిబిరాలు(సమ్మర్ క్యాంప్) నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి దుగ్గిపోగు జాన్ బాబు తెలియజేసినారు ఈ కార్యక్రమాలను ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహణ జరుగుతుందనిఈ శిబిరంలో విద్యార్థిని, విద్యార్థులకు బాల సాహిత్యం,కథలు వినడం,కథలు చెప్పడం,కథలు చదివించడం,పుస్తక సమీక్ష,చిత్రలేఖనం, చదరంగం,క్యారం,క్విజ్, జీకే,యోగ,వ్యాసరచన,వకృత్వ పోటీలు,కమ్యూనికేషన్ స్కిల్స్,కంప్యూటర్ పరిజ్ఞానం మొదలగు అంశాలను విద్యార్థిని, విద్యార్థులు నేర్చుకోవచ్చును అని తెలియజేసినారు. తల్లిదండ్రులు మీ పిల్లలను తప్పనిసరిగా గ్రంథాలయమునకు పంపించి మంచి విజ్ఞానవంతులుగా ప్రతిభావంతులు తయారు చేయవలసినదిగా విజ్ఞప్తి చేసారు.

