NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేరాల నియంత్రణకు హైటెక్ నిఘా పోలీసు.. వ్యాపారుల సమన్వయ సమావేశం

1 min read

ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్,ఏలూరు1టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ నిర్వహణ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్,ఐపీఎస్ ఆదేశాల మేరకు, శనివారం ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారు వ్యాపారులు మరియు ప్రధాన రహదారి దుకా ణదారులతో కీలక సమన్వయ సమావేశం నిర్వహించి నారు.అత్యాధునిక సాంకేతికతతో నిఘా నేరస్తుల ఆటకట్టిం చడానికి దుకాణ సముదాయాల్లో అత్యా ధునిక కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.కదలికలను గుర్తించి హెచ్చరించే మోషన్ క్యాప్చర్ కెమెరాలను అమర్చు కోవాలి.నేరస్తుల ముఖా లను స్పష్టంగా గుర్తించే ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా నిఘా పెంచాలి.రాత్రి సమయాల్లో కూడా స్పష్టమైన దృశ్యాలు రికార్డ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి.దుకాణదారులకు ముఖ్య సూచనలుషోప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌ మెంట్ యాక్ట్  చట్టంలోని నిబంధన లను కచ్చితంగా పాటించాలని, పోలీసుల తనిఖీలకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.ప్రతి వ్యాపార సంస్థ వద్ద అనుభవజ్ఞులైన సెక్యూరిటీ వాచ్‌మెన్‌లను నియమించుకోవాలి.రద్దీఎక్కువగా ఉండే వాణిజ్య ప్రాంతాలలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సొంతంగా ట్రాఫిక్ వార్డర్ల ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్న ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ జి.సత్యనారాయణ,  సి.ఐ,వన్ టౌన్.లక్ష్మణరావు, ట్రాఫిక్ సి.ఐ.ఎస్.ఐలు సుధాకర్,నాగబాబు, దుర్గా ప్రసాద్ మరియు రామకృష్ణ.వ్యాపారుల తరపున మధుసూధనరావు,సెక్రటరీ సత్యనారాయణ,వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగభూషణం మరియు ఇతర ప్రముఖ వ్యాపారులు పాల్గొన్నారు.పోలీసు యంత్రాంగం సూచించిన భద్రతా చర్యలను తూచా తప్పకుండా పాటిస్తామని మరియు నేరాల నియంత్రణలో పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు.వ్యాపారుల భద్రతే  పోలీసుల ప్రాధాన్యత ప్రజలు మరియు వ్యాపారులు సాంకేతికతను జోడించి పోలీసులతో కలిసి పనిచేసినప్పుడే నేరరహిత ఏలూరును నిర్మించగలమని అధికారులు ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *