NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బస్సు టైర్ల కింద పడి వృద్ధుడు మృతి

1 min read

బ్రాహ్మణకొట్కూరు ఎస్సై మణికంఠ..

నందికొట్కూరు న్యూస్ నేడు: ఆర్టీసీ బస్సు టైర్ల కింద పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో చోటుచేసుకుంది. బ్రాహ్మణకొట్కూరు ఎస్సై వి మణికంఠ తెలిపిన వివరాల మేరకు నందికొట్కూరు ఆర్టీసీ డిపోకు చెందిన ప్రైవేట్ బస్సు శనివారంఉ11 గంటల సమయంలో కర్నూలు నుండి నందికొట్కూరుకు వస్తున్న ప్రైవేటు బస్సు కొత్తపల్లి మండలం శివపురం గ్రామానికి చెందిన సయ్యద్ యూసుఫ్(63)బ్రాహ్మణకొట్కూరులో ఏబీఎం చర్చి దగ్గర బస్సు ఎక్కుతుండగా చేదు ఘటన జరిగింది.బస్ డ్రైవర్ బస్సును ఆకస్మాత్తుగా బస్సును వేగంగా ముందుకు నడుపుట వలన ప్రమాదవ శాత్తు యూసుఫ్ బస్సు వెనుక టైర్ కింద పడటం వలన అతని ఎడమకాలు ఛిద్రం కావడంతో చికిత్స కొరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ ఉండగా కోలుకోలేక మ 12:07 నిమిషాలకు మరణించినట్లు ఎస్సై తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *