NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వేసవి దృష్ట్యా ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకూడదు

1 min read

నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి, లోపం కనిపిస్తే ఆయా శాఖల అధికారులే బాధ్యత వహించాలి

అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు పోటీతత్వంతో  పనిచేసి లక్ష్యాలను అధిగమించాలి

ప్రతి గ్రామాన్ని చెత్త రహిత గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వం లక్ష్యం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కైకలూరు తహశీల్దారు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, ఆర్డబ్ల్యూఎస్, నీటిపారుదల శాఖ, ఎలక్ట్రిసిటీ, మత్స్యశాఖ,తదితర శాఖలు వారీగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్షలు నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధిలో  కలిసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధించగలమన్నారు. జిల్లాలో సోలార్ లో మొదటిస్థానంలో ఉన్నామని, ప్రతి ఇంటికి, రైతులకు, పరిశ్రమలకు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేలా కృషి చెయ్యాలని అన్నారు. జలధార – జలహారతి కార్యక్రమాలు వేగవంతం చెయ్యాలని, భూగర్భ జలాలు మట్టములను పెంచే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. జాతీయ ఉపాధి శ్రామికులకు పని దినాలు కల్పించి వారికి నిర్ణీత సమయంలో డబ్బులు జమ చెయ్యాలని అన్నారు. డోరు టు డోరు చెత్త కలెక్షన్లు చెయ్యాలని ఇందుకు  అవసరమైన వాహనాలు కొనుగోలు చెయ్యాలని, సంపద సృష్టించే కేంద్రాలు నిర్వహణ సక్రమంగా చెయ్యాలని అన్నారు. అంగన్వాడి కేంద్రంలో విజయవంతంగా చదువు పూర్తి చేసుకున్న వారిని ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతిలో జాయిన్ చేయించాలని, 5వ తరగతి పూర్తి చేసిన వారిని ఉన్నత పాఠశాల 6వ తరగతిలో జాయిన్ చేయించాలని అన్నారు.ఈ సమీక్షా సమావేశంలో మాజీ శాసన మండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు, ఇన్చార్జి ఆర్డీవో ఐ.కిషోరు, జిల్లా ఆర్& బి శాఖ యస్ఇ  కె.విజయరత్నం, ఆర్డబ్ల్యూఎస్ అధికారి జి.త్రినాధ బాబు, జిల్లా పంచాయతీ శాఖ అధికారి కె.అనురాధ, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమ్మ, జిల్లా మత్స్యశాఖ ఇన్చార్జి డిడి బి.రాజ్ కుమార్, ఐసిడియస్ పిడి పి.శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి సి.హెచ్.సూర్యచక్రవేణి, సంబంధిత వివిధ శాఖలు జిల్లా, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *