కాఫీ విత్ సీఎంతో..క్లస్టర్ ఇంచార్జ్ జాకీర్
1 min read
సీఎం శిక్షణా తరగతుల్లో లాయర్ జాకీర్ హుస్సేన్
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ పట్టణ క్లస్టర్ ఇంచార్జి న్యాయవాది జాకీర్ హుస్సేన్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా చేపట్టిన శిక్షణా తరగతులకు జాకీర్ హుస్సేన్ కు చోటు లభించింది.ఈనెల 24,25 తేదీల్లో రెండు రోజులపాటు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్రస్థాయిలో జరిగిన 15వ బ్యాచ్ శిక్షణ తరగతులకు జాకీర్ హుస్సేన్ హాజరయ్యారు.ఈ శిక్షణా తరగతులకు 120 మంది హాజరయ్యారు.ముఖ్యమంత్రి అనే తేడా లేకుండా ఇన్చార్జీల పక్కన కూర్చుని క్లస్టర్ ఇన్చార్జిలకు అభయాన్ని ఇచ్చారు.గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి మరియు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని మనం చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం.గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఉన్న తేడా గురించి ప్రజల మధ్యకు మీరు చొచ్చుకు వెళ్లి వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు క్లస్టర్ ఇన్చార్జిలకు వివరించినట్లు జాకీర్ హుస్సేన్ శనివారం సాయంత్రం తెలిపారు. అంతేకాకుండా సాటి కార్యకర్తలాగే మాతోపాటు కూర్చుని (కాఫీ విత్ ముఖ్యమంత్రి)సీఎం కాఫీ తాగారని అన్నారు.


