NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉచిత కంటి వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి! 

1 min read

ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్

న్యూస్ నేడు, పత్తికొండ : ఉచిత కంటి వైద్య శిబిరాన్ని  ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ.శ్యాం కుమార్ కోరారు. శనివారం పత్తికొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు మరియు యువ స్పందన సొసైటీ ఆధ్వర్యంలో చెన్నై శంకర నేత్రాలయ  కంటి వైద్యశాల సహకారంతో ఏర్పాటు చేస్తున్న “ఉచిత కంటి పొర చికిత్స శిబిరం” కరపత్రాలను ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం చెన్నై శంకర నేత్రాలయ కంటి వైద్య శాలను డాక్టర్ కిషోర్ రెడ్డి మరియు చిట్టెం హనుమాన్ ప్రసాద్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉచిత కంటి శిబిరంలో వైద్య పరీక్షల అనంతరం అదునాతనమైన పరికరాలతో    ఆపరేషన్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పత్తికొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు ఈనెల 30 నుండి వచ్చేనెల 6వ తేదీ వరకు కంటి పరిశీలన మరియు  04.05.2026 నుండి 8వ తేదీ వరకు కంటి శుక్లాం (పొర) ఆపరేషన్ ఉంటుందని, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఉచిత వైద్య శిబిరం అందుబాటులో ఉంటుందని తెలిపారు. కావున గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు అడ్వకేట్ సురేష్ కుమార్, లెక్చరర్ వీరేశప్ప, నాయకులు ప్రమోద్ కుమార్ రెడ్డి, యువ స్పందన సొసైటీ  అధ్యక్ష, ఉపాధ్యక్షులు సురేంద్ర, లక్ష్మన్న, సెక్రటరీ నాగరాజు, సభ్యులు జిలాన్, గిరీష్, రమేష్, రంగన్న, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *