NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సృష్టి అంతాభగవంతుని స్వరూపమే …

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే.

తూర్పు ప్రాతకోటలో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు

కర్నూలు, న్యూస్​ నేడు: సృష్టి అంతా భగవంతుని స్వరూపమే అని భావించే ఉదారభావమే సనాతన ధర్మమని, క్రిమి కీటకాది మొదలు బ్రహ్మ పర్యంతం భగవంతుడు నిండి ఉన్నాడని, సర్వభూతములపట్ల హితభావన సనాతన వైదిక ధర్మం పట్ల మాత్రమే సాధ్యమని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. పగిడ్యాల మండలం, తూర్పు ప్రాతకోటలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. మూడు రోజులపాటు శ్రీమద్రామాయణం, వేంకటేశ్వరస్వామి వైభవం గురించి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ చిన్నావుల వేంకట రాజారెడ్డి చేసిన ప్రవచనాలు,  స్థానిక భజన మండలిచే నిర్వహించిన భజన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో  ధర్మ ప్రచారమండలి సభ్యులు అంబటి శివశంకర రెడ్డి, స్థానిక అర్చకులు నాగలింగమయ్య, భజన మండలి అధ్యక్షులు పి.స్వర్ణలత, ఎ.ఎల్లగౌడ్, కె.నాగరాజు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. మల్లికార్జున, ఉపాధ్యాయులు యం.నాగార్జున గౌడ్, ఎ. మల్లికార్జున గౌడ్, వై. రాజశేఖర్ రెడ్డి, యం. నందీశ్వర గౌడ్, డి. హుసేన్, యు. మోనిక, ఐ. హైమావతి, కె. లక్షుమ్మ, గోవిందమ్మతో పాటు భజన బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *