NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పసిబిడ్డకు పునర్జన్మను ప్రసాధించిన కిమ్స్ కడల్స్ వైద్యులు

1 min read

పుట్టిన ఏడో రోజే విజయవంతంగా సర్జరీ

హిర్ష్ స్ర్పంగ్ ముప్పు తొలగింపు.

కర్నూలు, న్యూస్​ నేడు : జన్మించిన ఏడవే రోజుకే… సర్జరీ చేసి చిన్నారి ప్రాణాలు కాపాడిన అరుదైన సంఘటన కిమ్స్ కడల్స్ కర్నూలులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన చికిత్సనందించిన వివరాలను కన్సల్టెంట్ పీడియాట్రిక్ యూరాలజిస్ట్ డా. సాయి ప్రసూన తెలిపారు.తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లాకు చెందిన ఓ జంటకు జన్మించిన శిశువు పుట్టి రెండు రోజులు గడిచినా మల విసర్జన జరగకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దీంతో వారు కిమ్స్ కడల్స్ కర్నూలుకి తీసుకవచ్చారు. శిశువును పరిశీలించిన తర్వాత బిడ్డ ‘హిర్ష్‌స్ప్రంగ్ వ్యాధి’తో బాధపడుతున్నట్లు గుర్తించారు. హిర్ష్‌స్ప్రంగ్ వ్యాధి అంటే మన పేగుల్లో మలాన్ని ముందుకు నెట్టడానికి ప్రత్యేక నరాల కణాలు ఉంటాయి. ఈ వ్యాధితో పుట్టిన పిల్లల్లో పేగు చివరి భాగంలో ఈ నరాలు ఉండవు. దీనివల్ల ఆ భాగం సంకోచించకపోవడంతో మలం ముందుకు కదలదు. ఫలితంగా పేగులు ఉబ్బిపోవడం, ఇన్ఫెక్షన్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఈ బిడ్డ విషయంలో గంటలు గడుస్తున్నా విసర్జన జరగలేదు. రెండో రోజు నాటికి పొట్ట ఉబ్బిపోవడం, ఆకుపచ్చ రంగులో వాంతులు రావడం మొదలయ్యాయి. “శిశువు పుట్టిన తర్వాత మొదటి 48 గంటలు అత్యంత కీలకం. ఆ సమయంలో మల విసర్జన జరగకపోవడాన్ని మేము ‘సర్జికల్ సైరన్’గా భావిస్తాం,” అని  తెలిపారు.శిశువు జన్మించిన ఏడవ రోజుకే సర్జరీ చేసి చిన్నారికి ఊరట కల్పించాం. గతంలో ఈ సమస్యకు రెండు దశల్లో శస్త్రచికిత్స చేసేవారు. ముందుగా పొట్టపై కోత పెట్టి మలం బయటకు రావడానికి కొలోస్టమీ సంచి ఏర్పాటు చేసి, తర్వాత మరోసారి శస్త్రచికిత్స చేసేవారు.అయితే కిమ్స్ కడల్స్ వైద్య బృందం ఆధునిక ట్రాన్స్‌అనల్ ఎండోరెక్టల్ పుల్-త్రూ విధానంతో శస్త్రచికిత్స నిర్వహించింది. ఈ విధానంలో ఎటువంటి కోతలు లేకుండా మలద్వారం ద్వారానే ఆపరేషన్ చేశారు.“ఈ విధానం వల్ల కొలోస్టమీ సంచి అవసరం లేకుండా ఒకే దశలో సమస్యను పరిష్కరించగలిగాం. బిడ్డకు మచ్చలు లేకుండా సురక్షితమైన చికిత్స అందుతుంది,” అని డాక్టర్ సాయి ప్రసూన తెలిపారు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్లో మలబద్ధకాన్ని చిన్న సమస్యగా భావించి విరోచన మందులు వేస్తుంటారు. దీనిని ‘హ్యాబిచ్యువల్ కాన్స్టిపేషన్’ అంటారు. కానీ హిర్ష్‌స్ప్రంగ్ వ్యాధి ఉంటే మందులు పనిచేయవు. గుర్తించకుండా వదిలేస్తే ‘ఎంటెరోకోలిటిస్’ అనే తీవ్రమైన పేగుల ఇన్ఫెక్షన్‌కు దారితీసి ప్రాణాలకు ముప్పుగా మారవచ్చు.పాలు తాగడానికి నిరాకరించడం,  ఆకుపచ్చ రంగులో వాంతులు రావడం, పొట్ట గట్టిగా ఉబ్బిపోవడం, మందులు వాడినా మల విసర్జన జరగకపోవడం వంటివి గుర్తిస్తే వెంటనే ఆస్పత్రికి తీసువెళ్లి వైద్యులకు చూపించాలని సూచించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *