హోంగార్డు యూనిట్ లో విధులు నిర్వహిస్తూ,దుర దృష్టవశాత్తు మరణించటం బాధాకరం
1 min read
జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్
పీజీఐ కింద మంజూరైన పదకొండు లక్షల నలభై వేల రూపాయల బీమా చెక్కును వీరబాబు భార్య రామ లక్ష్మీ దేవికి అందజేత
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా హోంగార్డు యూనిట్ లో విధులు నిర్వహిస్తూ,దుర దృష్టవశాత్తు ప్రమా దవశాత్తు మరణించిన హోంగార్డు (హెచ్ 574) ఎం. వీరబాబు కుటుంబానికి జిల్లా పోలీసు యం త్రాంగం అండగా నిలిచింది. బుధవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాల యంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ప్రభుత్వ జనరల్ ఇన్సూరెన్స్ (పీజీఐ) కింద మంజూరైన ₹11,40,000 (పదకొండు లక్షల నలభై వేల రూపాయల) బీమా చెక్కును వీరబాబు భార్య రామ లక్ష్మీ దేవి కి అంద చేసినారు.బీమా చెక్కును అందజేసిన అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎం. వీరబాబు విధుల పట్ల ఎంతో అంకిత భావం, క్రమశిక్షణ కలిగిన వ్యక్తని కొనియాడారు.ఆయన మరణించడం ఏలూరు జిల్లా హోం గార్డు విభాగానికి తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. హోంగార్డు వ్యవస్థ లో వీరబాబు అందించిన సేవలు చిరస్మరణీయమని, వారి కుటుంబానికి ఏలూరు జిల్లా పోలీసు శాఖ మరియు హోంగార్డు వ్యవస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ హామీ ఇచ్చారు. బీమా సొమ్ము వారి కుటుంబానికి కొంత మేర ఆర్థిక ఊరట నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.బాధిత కుటుంబానికి బీమా సొమ్ము త్వరగా అందేలా కృషి చేసిన సంబంధిత అధికారు లను ఎస్పీ అభినందించారు.పోలీసు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సిబ్బంది భద్రతకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ బి-సెక్షన్ సూపరిం టెండెంట్ పి.నాగేశ్వర రావు, పోలీస్ కార్యాలయ సిబ్బంది మరియు హోంగార్డు విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు.

