NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రంథాలయల్లో వేసవి విజ్ఞాన శిబిరాలు

1 min read

రిసోర్స్ పర్సన్ అట్లూరు సతీష్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు శాఖా గ్రంధాలయం నందు వేసవి సెలవుల్లో శాఖ గ్రంథాలయంలో భాగంగా వేసవి విజ్ఞాన శిబిరంలోని కార్యక్రమం రెండో రోజు బుధవారం విద్యార్థిని,విద్యార్థులకు రిసోర్స్ పర్సన్ అట్లూరి సతీష్  జనరల్ నాలెడ్జ్ గురించి చెప్పి దానిలోని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగినది. తదుపరి విద్యార్థులచే కథలు చదివించడం,కథలు చెప్పించడం జరిగినది.మరియు లూడో,చెస్ ఆటలు ఆడించి వాటిలోని మెలుకువలు నేర్పించడం జరిగినది. భవిష్యత్తులో తమకు ఉపయోగపడే అంశాలను ఈ విజ్ఞాన శిబిరాల ద్వారా అలవర్చుకోవటంతో చదవ బోయే పాఠ్యాంశాలను మరియు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు ,15 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని నారు.ఈ కార్యక్రమం అంతయు గ్రంథాలయాధికారి దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.పాల్గొనిన విద్యార్థిని, విద్యార్థులకు స్నాక్స్ పెంచి పెట్టడం జరిగినదని తెలియజేసినారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *