స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్స్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ప్రాణాలను రక్షించే అత్యంత గొప్ప సేవ అయిన రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు లో ఏప్రిల్ 30, 2026న స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని సీనియర్ కార్డియాలజిస్ట్ డా. చైతన్య ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి సిబ్బంది, పేషెంట్లు మరియు వారి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విశేషంగా స్పందించారు. రక్తదానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు ప్రాణదాతలుగా మారినందుకు పాల్గొన్న వారిని వైద్యులు అభినందించారు.వైద్యుల ప్రకారం ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ప్రసవాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి ఆరోగ్యవంతుడు క్రమం తప్పకుండా రక్తదానం చేయడం ద్వారా సమాజానికి గొప్ప సేవ చేయవచ్చని సూచించారు. శిబిరం మొత్తం వైద్యుల పర్యవేక్షణలో సురక్షితంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ Maheswar Reddy మాట్లాడుతూ,“రక్తదానం అనేది ఒక చిన్న సహాయం కాదు – అది ఒక ప్రాణాన్ని కాపాడే గొప్ప దానం. సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతను గుర్తించి ముందుకు రావాలి. మా ఆసుపత్రి ఎల్లప్పుడూ ఆరోగ్య సేవలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటుంది” అని తెలిపారు.


