రైతుల ఆత్మగౌరవానికి ప్రతీక రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలు
1 min read
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడి
కొక్కిరపాడులో 612 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
పెదపాడు మండలంలో ఇప్పటివరకు 11 గ్రామాల్లో పూర్తయిన రీ సర్వే
గత వైసిపి ప్రభుత్వ భూ దోపిడీ, అక్రమాలకు చరమగీతం
గ్రామస్తులతో ముఖా-ముఖి సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు మండలం కొక్కెరపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సోదరుల భూములకు అసలైన భద్రత మరియు ఆత్మగౌరవాన్ని కల్పిస్తూ కూటమి ప్రభుత్వం రీ సర్వేలు జరిపించి,రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తోందని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం పెదపాడు మండలం కొక్కెరపాడు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, వేంపాడు రెవెన్యూ గ్రామ పరిధిలోకి చెందిన 612 పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి స్థానిక కూటమి నాయకులు, అధికారులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “గత వైసిపి పాలనలో రైతుల పాస్ పుస్తకాలపై రాజముద్రను తొలగించి, వారి ఫొటోలు వేసుకుని భూములపై హక్కులను కాలరాసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. పట్టాదారు పాస్ పుస్తకం అంటే రైతన్నకు ఒక ధైర్యం, గౌరవం అని .ఈ కార్యక్రమంలో దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గారపాటి రామసీత,జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బొప్పన సుధా,ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పలపాటి రాంప్రసాద్, క్లస్టర్ ఇంచార్జ్ గుత్తా అనిల్, మండల తహసిల్దార్ కృష్ణ జ్యోతి, వట్లూరు సొసైటీ చైర్మన్ కొమ్మన లక్ష్మణ్ మోహన్ (బుడ్డియ్య ), చంటి బాబు,మండల పార్టీ అధ్యక్షులు మరడాని రవి, సెక్రటరీ వేగుంట సురేష్ బాబు, క్లస్టర్ ఇంచార్జ్ ముళ్ళపూడి సాంబశివరావు,సహా పలువురు కూటమి నాయకులు మండల పార్టీల అధ్యక్షులు,క్లస్టర్ ఇన్చార్జిలు, సొసైటీల చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది,గ్రామస్తులు,రైతులు పాల్గొన్నారు.


