మొక్కజొన్న రైతులను వెంటనే ఆదుకోండి
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: మొక్కజొన్న రైతులను వెంటనే ఆదుకోండి – కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని ప్యాపిలి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బి. భారతి కి వినతిపత్రం అందజేశారు.రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని సిపిఐ ప్యాపిలి మండల కార్యదర్శి జె. మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రబీ సీజన్‌లో సుమారు 13 జిల్లాల్లో 12.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగినప్పటికీ, రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం క్వింటా మొక్కజొన్నకు రూ. 2,400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వ్యాపారస్తులు సిండికేట్‌గా మారి రూ. 1,700 లోపు ధరలకు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల రైతులకు క్వింటాకు సుమారు రూ. 700 నష్టం, ఎకరానికి రూ. 21,000 వరకు నష్టం వస్తోందని పేర్కొన్నారు.విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలి ఖర్చులు విపరీతంగా పెరిగిన పరిస్థితిలో, రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాని దుస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పట్టణ కార్యదర్శి పి.వెంకటేష్, మనోహర్, రమేష్, సురేషు, రవి, చందు, శీను,పాల్గొన్నారు.

