కమిషనర్ సజ్జనారును కలిసిన ఎమ్మెల్యే విరుపాక్షి
1 min read
రాయలసీమ అభివృద్ధిపై విస్తృత చర్చ
హోళగుంద న్యూస్ నేడు: హైదరాబాద్‌లో కమిషనర్‌ను ఎమ్మెల్యే విరుపాక్షి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధి, ప్రాథమిక వసతుల విస్తరణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.ఈ భేటీలో రాయలసీమలో అభివృద్ధి వేగవంతం చేయాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే విరుపాక్షి ప్రస్తావించారు. ముఖ్యంగా నీటి వనరులు, రోడ్లు, విద్య మరియు ఆరోగ్య రంగాల్లో మెరుగుదల కోసం అవసరమైన చర్యలపై దృష్టి సారించాలని కోరారు.హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ చేస్తున్న సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు. ప్రజల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం అని తెలిపారు.రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని కమిషనర్‌ను ఎమ్మెల్యే విరుపాక్షి కోరారు.

