NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు వర్ధంతి

1 min read

ఘనంగా నివాళులర్పించిన …. అడిషనల్ ఎస్పీలు శ్రీ హుస్సేన్ పీరా , శ్రీ కృష్ణమోహన్ . 

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు  ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  ఆదేశాల మేరకు కర్నూలు అడిషనల్ ఎస్పీలు శ్రీ హుస్సేన్ పీరా, శ్రీ కృష్ణ మోహన్ లు ​జిల్లా పోలీసు కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు  వర్ధంతి సంధర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ శ్రీ హుస్సేన్ పీరా  మాట్లాడుతూ…అల్లూరి సీతరామరాజు  వంటి మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, దేశ సేవలో ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన ధీశాలి అల్లూరి సీతరామరాజు అని, సాయుధ పోరాటం ద్వారానే స్వేచ్ఛ సాధ్యమని నమ్మిన మహనీయుడన్నారు.గిరిజనుల హక్కుల కోసం, వారిపై జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా మన్యం ప్రజలను ఏకం  చేశారన్నారు.అల్లూరి సీతారామరాజు చూపిన ధైర్యం, దేశభక్తి ప్రతి భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐలు నారాయణ, జావేద్, ఆర్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

About Author