NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

” పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ”                           

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా జడ్జి మరియు అధ్యక్షులు జి. కబర్థి సూచనల మేరకు  ఈ రోజు అనగా 07-05-2026 న న్యాయ సేవా అధికార సంస్థ, కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి, స్థానిక జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ పక్కన గల  హోప్ ఆఫ్ హోం నందు  పోక్సో యాక్ట్ పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ జాగృతి పథకం 2025 కింద “సురక్షిత బచ్పన్- సురక్షిత్ భవిష్య” పై అవగాహన కల్పించారు. అక్కడి గల పిల్లలకు పోక్సో యాక్ట్ పై అవగాహన కల్పించారు. లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం 2012 ప్రకారం పిల్లల పై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు కలవని తెలిపారు. 18 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడకుండా   ఈ పోక్సో యాక్ట్  ఉపయోగ పడుతుందని తెలిపారు.ఈ పోక్సో కేసుల ను త్వరిత గతిన పరిష్కరించేoదుకు ప్రత్యేక కోర్ట్ కలదని తెలిపారు. పిల్లలకు ఏదయినా సమస్య వస్తే  లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నెంబర్ 15100 కాల్ చేస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్. 1098,మహిళా హెల్ప్ లైన్ నెంబర్. 181,పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్. 112 ల  గురించి పిల్లలకు వారి తల్లిదండ్రులకు వివరించారు. ఈ సదస్సు లో ఐసీడీస్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, జాగృతి యూనిట్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్   పాల్గొన్నారు.

About Author