వృద్ధుడికి ఆర్థిక సహాయం అందజేసిన అజీస్..
1 min read
నందికొట్కూరు న్యూస్ నేడు: గత కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్న వృద్దుడికి తన వంతుగా ఆర్థిక సహాయం అందజేస్తూ ప్రభుత్వపరంగా వచ్చే పథకాలను కుటుంబానికి వచ్చే విధంగా చూసే బాధ్యత నాది అంటూ కుటుంబ సభ్యులకు భరోసానిస్తున్నారు అబ్దుల్ అజీస్..నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం రెండవ వార్డు కాలనీకి చెందిన షేక్ గులాముద్దీన్ బషీర్(63) గత మూడేళ్లుగా ఆయాసం మరియు అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్నారు.40 వేల తో ఆక్సిజన్ మిషన్ కొని అప్పటి నుండి ఇంటిలోనే ఆక్సిజన్ తీసుకుంటున్నారు. ఇది తెలుసుకున్నతెలుగుదేశం పార్టీ వార్డు సీనియర్ నాయకులు షేక్ అబ్దుల్ అజీస్ వారి ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయం అందజేశారు.నాకు పింఛన్ రావడంలేదని వృద్ధుడు తెలుపగా పింఛన్ వచ్చే విధంగా కృషి చేస్తానని అంతేకాకుండా ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలను మీ కుటుంబానికి వచ్చే విధంగా కృషి చేస్తానని అజిత్ భరోసా ఇచ్చారు.

