NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులు కష్టపడి చదివి దేశ సేవలో భాగస్వామ్యం కావాలి

1 min read

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష 2026 ఉత్తమ మార్కులు సాధించిన వారిని అభినందించిన జాయింట్ కలెక్టర్

కర్నూలు, న్యూస్​ నేడు  : సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష 2026 ఉత్తమ మార్కులు సాధించిన వారిని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అభినందించారు.గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష 2026 ఉత్తమ మార్కులు సాధించిన వారిని జాయింట్ కలెక్టర్ అభినందించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి దేశ సేవలో భాగస్వామ్యం కావాలని కోరారు. కఠినమైన క్రమశిక్షణ, పట్టుదలతో చదివి సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించడం అభినందనీయమన్నారు.. సైనిక్ స్కూళ్లలో లభించే శిక్షణను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో దేశ రక్షణలో కీలక పాత్ర పోషించాలని జాయింట్ కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లాలోని మరింత మంది విద్యార్థులు ఇలాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చేరేందుకు ఈ విజయం స్ఫూర్తిగా నిలుస్తుందని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *