హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామికి ఎంపీ ప్రత్యేక పూజలు
1 min read
నూతన దంపతులను ఆశీర్వదించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
దెందులూరు నియోజకవర్గంలో ఏలూరు ఎంపీ పర్యటన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరు మండలం చల్లచింతలపూడిలో పార్టీ నేత ఇంట వివాహ వేడుకలకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. గన్నవరంలో ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడి కుమార్తె వివాహానికి హాజరు. అనంతరంహనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలుఏలూరు పార్లమెంట్ పరిధిలో శుక్రవారం విస్తృతంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటించిన పలువురు పార్టీ నేతల ఇంట వివాహాది శుభ కార్యాలకు హాజరయ్యారు. ముందుగా ఉదయం దెందులూరు నియోజకవర్గం చల్లచింతలపూడి వెళ్లిన ఎంపీ, పార్టీ నేత నాగనబోయిన సత్యనారాయణ, చంద్రావతి దంపతుల కుమార్తె ప్రసన్న కుమారి వివాహం సందర్భంగా నూతన వధువును ఆశీర్వదించి “మహేష్ అన్న పెళ్ళి కానుక” అందజేసి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గన్నవరంలో జరుగుతున్న ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి కుమార్తె గీతిక వివాహ వేడుకకు హాజరైన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వధూవరులను ఆశీర్వదించి “మహేష్ అన్న పెళ్ళి కానుక” అందజేశారు. గన్నవరం వెళుతూ మార్గమధ్యలో హనుమాన్ జంక్షన్ లోని అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద ఆగి, హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకమండలి ఛైర్మన్, ఈవో ఆలయ మర్యాదలతో ఎంపీకి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ పూజారులు ఎంపీకి ఆశీర్వచనం, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసారు.


