NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సుమారు రెండు కోట్లతో నిర్మించిన రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

1 min read

అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించే కూటమి ప్రభుత్వాన్ని ఆశ్రవధించాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు

పెనమలూరు, న్యూస్​ నేడు:  పెనమలూరు నియోజకవర్గం, పెనమలూరు మండలం, గోసాల గ్రామంలో  రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన చింతలకట్ట, పాత సంత సీసీ రోడ్లను నియోజకవర్గ శాసనసభ్యులు బోడె ప్రసాద్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ముందుగా స్థానికులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఓటేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేపట్టి పూర్తి చేస్తున్నామన్నారు. ఒక్క గోసాల గ్రామంలోని రెండు సంవత్సరాలలో 3.5 కోట్లతో అభివృద్ధి పనులు చేయటం సామాన్యమైన విషయం కాదన్నారు. గోసాల,వణుకూరు ప్రధాన రహదారిని సుమారు ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో కనీసం గుంటలు కూడా పూడ్చలేదు, కూటమీ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలలో నియోజకవర్గంలో సుమారు 200 కోట్లతో డ్రైనేజీలు, సిసి రోడ్లు  నిర్మించామన్నారు. రాబోయే రెండు సంవత్సరాలలో నియోజవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తిస్థాయిలో చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ రావు పెనమలూరు మండల పార్టీ అధ్యక్షులు కోయ ఆనంద ప్రసాద్ రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పీత గోపీచంద్ రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ తాతపూడి గణేష్ రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ బాలాజీ బిజెపి నాయకులు ఏ కుల విజయేంద్ర షేక్ మహబూబ్ సుభాని ఎందువ రాంబాబు కోనేరు వెంకటేశ్వరరావు సుంకర రమేష్ మన్నె వాసు పిడికిడి శ్రీనివాసరావు వల్లే నరసింహారావు  కోనేరు కోటేశ్వరరావు అబ్దుల్ సలాం డి ఈ శ్రీనివాస్ ఏఈ రాజేష్ ఇన్చార్జ్ ఎం డి వో బొమ్మసాని శ్రీనివాసరావు కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *