రాయలసీమ అభివృద్ధికి మరో అడుగు – రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమకు స్వాగతం
1 min read
యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో కీలక నిర్ణయం – వైకుంఠం జ్యోతి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌కు రాయలసీమ ప్రజల కృతజ్ఞతలు
పారిశ్రామిక ప్రగతితో ముందుకు దూసుకెళ్తున్న మన రాయలసీమ
రాయల్ ఎన్ఫీల్డ్ రాకతో ఆలూరు ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తూ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎల్ఫీల్డ పరిశ్రమను మన ప్రాంతానికి తీసుకురావడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,“మన యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, రాయలసీమ అభివృద్ధికి బాటలు వేస్తూ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నారా లోకేశ్ లకు మా రాయలసీమ ప్రజల తరపున మరియు ఆలూరు నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.రాయల్ ఎన్ఫీల్డ్ వంటి ప్రతిష్టాత్మక పరిశ్రమలు రావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, చిన్న వ్యాపారాలు, రవాణా, సేవారంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.అలాగే రాబోయే రోజుల్లో రాయలసీమను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, యువత భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

