NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నర్సింగ్ సిబ్బందిని సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు లో నర్సింగ్ సిబ్బందితో కలిసి ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది మరియు పేషెంట్లు పాల్గొని నర్సుల సేవలను అభినందించారు.ఈ సందర్భంగా కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డా. సిద్ధార్థ్ హెరూర్ మాట్లాడుతూ, రోగుల ఆరోగ్య సంరక్షణలో నర్సుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. పేషెంట్లకు 24 గంటలు సేవలందిస్తూ, వైద్య సేవల్లో నర్సులు అంకితభావంతో పనిచేస్తారని పేర్కొన్నారు. వారి సేవా దృక్పథం ఆరోగ్య రంగానికి గొప్ప బలం అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని వివిధ వినోదాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నారు. అలాగే పేషెంట్లు మరియు నర్సింగ్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ఆనందంగా నిర్వహించారు. పేషెంట్లు కూడా నర్సుల సేవలను అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్  మహేశ్వర్​ రెడ్డి    మాట్లాడుతూ“నర్సులు ఆరోగ్య రంగానికి వెన్నెముకలాంటివారు. రోగుల సేవలో వారు చూపించే అంకితభావం అమూల్యమైనది. మా ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఎంతో నిబద్ధతతో సేవలందిస్తున్నారు. వారి కృషిని గౌరవించడం మా బాధ్యతగా భావిస్తున్నాం” అని తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *