ద్వారకా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దెందులూరు ఎమ్మెల్యే
1 min read
ఆలయ మర్యాదలతో అధికారులు ఘన స్వాగతం కుటుంబ సభ్యులకు
అర్చకుల వేద ఆశీర్వచనం తీర్థప్రసాదాల అందజేత
రాష్ట్రం సుభిక్షంగా,ప్రజలు ఆనందంగా ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం,చిన్న తిరుపతిగా వెలుగొందుతున్న ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. తన ధర్మపత్ని రాధారాణి మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కి దేవస్థానం అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు.ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు మరియు హారతి సేవల్లో పాల్గొన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మరియు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ వేంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దంపతులకు శాస్త్రోక్తంగా వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారీ శేష వస్త్రాన్ని కప్పి, తీర్థ ప్రసాదాలను మరియు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “ప్రజలకు సేవ చేసే అవకాశం దేవుడు ఇచ్చిన వరమని, ఆ సేవను మరింత సమర్థవంతంగా నిర్వర్తించేందుకు దైవబలం తోడవాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు.


