పెదపాడు శాఖ గ్రంథాలయ వేసవి విజ్ఞాన శిబిరం
1 min read
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జీవిత చరిత్ర వివరణ
ఇండోర్ గేమ్స్ చెస్-లూడో ఆటలపై అవగాహన
పరమానందయ్య శిష్యులు కథలో కాలువదాటుట అనే కదా శీర్షిక
రిసోర్స్ పర్సన్ అట్లూరి సతీష్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు శాఖా గ్రంధాలయం నందు ఉచిత వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా బుధవారం రిసోర్స్ పర్సన్ అట్లూరి సతీష్ పాల్గొనిన విద్యార్థిని విద్యార్థులకు భారతదేశపు మిస్సైల్ మ్యాన్ గా పేరుగాంచిన అబ్దుల్ కలాం గురించి తెలుపుచూ ఏ.పీ.జే అబ్దుల్ కలాం భారత 11వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త అతని పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులద్దీన్ అబ్దుల్ కలాం. 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచిరాపల్లిలో సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు. చెన్నైలోని మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుండి ఏరో స్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందాడు.భారత రాష్ట్రపతి పదవికి ముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ,భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ,(ఇస్రో-ఐ.ఎస్.ఆర్.ఓ) లో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశాడు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్ గా పేరుగాంచాడు. కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి, ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధికి కృషి చేశాడు. 1998లో భారత దేశ పోక్రాన్-2 అణు పరీక్షలలో కీలకమైన, సంస్థగత, సాంకేతిక, రాజకీయ పాత్ర పోషించాడు. అని తెలియజేశారు. అనంతరం పరమానందయ్య శిష్యులు కథలోని కాలువ దాటుట అనే కథను విద్యార్థులచే చదివించడం,పుస్తక పఠనం చేయించడం జరిగినది.తరువాత ఆటవిడుపులో భాగంగా ఇండోర్ గేమ్స్ చెస్-లూడో ఆటలపై అవగాహన కల్పించి,నేర్పించి, ఆడించడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొనినారు.ఈ కార్యక్రమం అంతయు గ్రంథాలయాధికారి దుగ్గిపోగు జాన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించుట జరిగినది. పాల్గొనిన విద్యార్థిని విద్యార్థులకు స్నాక్స్ పంచిపెట్టడం జరిగినదని తెలియజేశారు.


