NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చింతలపూడి నియోజకవర్గ ప్రజలు నాపై వచ్చే ఆరోపణలు, అపోహల నమ్మవద్దు

1 min read

మండల అధ్యక్షులు గరిమళ్ళ చలపతిరావు

25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూన్న

క్యాడర్ ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే క్రమశిక్షణ చర్యలకు తప్పవు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: లింగపాలెం మండలం లో  ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో లింగపాలెం మండల అధ్యక్షులు గరిమళ్ళ చలపతిరావు మాట్లాడుతూ గత రెండు రోజులుగా  సోషల్ మీడియాలో నాపై వస్తున్న ఆరోపణలు వాస్తవాలు కావని నియోజకవర్గ ప్రజలు నమ్మవద్దని ఆయన అన్నారు,నిజా నిజాలు త్వరలోనే బహిర్గతం అవుతాయని ఎవరు ఎటువంటి వారో తెలుసుకొని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని నియోజకవర్గ మరియు మండలంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని క్యాడర్ ని ఎవరు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసినా వారు క్రమశిక్షణ చర్యలకు బాధ్యులు అవుతారని ఆయన హెచ్చరించారు.గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ రెండు పర్యాయాలు మండల పార్టీ అధ్యక్షుడిగా ప్రజలు ఎన్నుకోవడం తన నిజాయితీకి నిదర్శనం అని ఆయన అన్నారు. మండలంలో తెలుగుదేశం పార్టీని మరింత బలపరచడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ పల్లి శ్రీను,తెలుగు యువత అధ్యక్షులు, నత్త నాగేంద్ర,మండల ప్రధాన కార్యదర్శి గజ్జా వెంకటేశ్వరరావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు, తాడేపల్లి దాసు బాబు,పలగాని సుబ్బారావు,ఖమ్మం రవి,అసిలేటి అజయ్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *