జాతీయ స్థాయిలో కర్నూలు క్రీడాకారులు రాణించాలి.. డాక్టర్. శంకర్ శర్మ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలులో క్రీడలు అభివృద్ధి చెందడం ఎంతో సంతోషంగా ఉందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు లో వేసవి శిక్షణ తరగతులు క్రీడా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 80 శిబిరాలు ఏర్పాటు చేశారు. అవుట్ డోర్ స్టేడియంలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు డాక్టర్. శంకర్ శర్మ పౌష్టికాహారం అందజేశారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్ శర్మ మాట్లాడుతూ క్రీడల అభివృద్ధి కోసం మంత్రి టీజీ. భరత్, మాజీ ఎంపీ టీజీ. వెంకటేష్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. వారి కృషి తో పాటు మరికొందరి సహకారంతో కర్నూలు స్పోర్ట్స్ హాబ్ గా మారుతుందన్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం, సాయంత్రం మాత్రమే క్రీడలు ప్రాక్టీస్ చేయాలని సూచించారు. విద్యార్థులు మంచి ఆహారంతో పాటు పండ్లు, తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. క్రీడల్లో పాల్గొంటే గెలుపు ఓటములను సమానంగా తీసుకునే మనోధైర్యం అలవాటు అవుతుందని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు.ఈకార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి సంస్థ అధికారి భూపతి రావు, చిన్న సుంకన్న, శిరీష తదితరులు పాల్గొన్నారు.

