12వ పి. ఆర్. సి కమిషన్ ఏర్పాటు చేయాలి
1 min read
ఎస్ టి యు కర్నూలు జిల్లా అధ్యక్షులు టి.కే. జనార్ధన రాష్ట్ర కార్యదర్శి, ఐ. రామమోహన్ రెడ్డి
12వ పిఆర్సి కమిటీని వెంటనే ఏర్పాటు చేసి 30% IR ప్రకటించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు టి.కే. జనార్ధన, రాష్ట్ర కార్యదర్శి
ఐ. రామమోహన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎం సి సుంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ ఎస్ టి యు ప్రాంతీయ కార్యాలయంలో మండల అధ్యక్షులు ఏ. నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సీనియర్ నాయకులు సత్యనారాయణ కుంపటి నారాయణ పాల్గొన్న ముఖ్య నాయకుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు టి.కే జనార్ధన ప్రసంగించారు.రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ 2023 జూలై నుండి అమలు చేయాల్సిన 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయలేదని అన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగులు ఉద్యమాలు నిరసనలు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తుందని ఇది ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. ఇప్పటికే ప్రభుత్వం నాలుగు డీఏలను పెండింగ్లో పెట్టడం, IR పై ఎటువంటి ప్రకటన చేయకపోవడం దురదృష్టకరమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారపక్షంలో ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తించడం ప్రభుత్వానికి సబబు కాదని కావున వెంటనే పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని, గురుకుల మరియు ప్రభుత్వ రంగ సంస్థల, సొసైటీ తదితర ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, కేంద్ర ప్రభుత్వం మెమో- 57 ప్రకారం రాష్ట్రంలో ఉన్న 11వేల ఉపాధ్యాయ,పోలీస్, ఉద్యోగులకు OPS అమలు చేయాలని, గత ప్రభుత్వ కాలం నుండి పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపు పై ఒక ప్రకటన చేసి రూట్ మ్యాప్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

